సెల్ఫీ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య.. కారణం అదేనా..? (వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2023-03-14 07:32:24  IST  )

<p>దిశ, హుజూర్‌నగర్: సెల్ఫీ వీడియో తీస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి‌న సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురుగుల‌ మందు తాగుతూ మృతుడు సెల్ ఫోన్‌తో తీసుకున్న వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గువ్వల పవన్(20) పోటీ పరీక్షలకు సిద్దమవుతూ హైదరాబాద్ లో ఉంటున్నాడు‌. పవన్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత […]</p>

సెల్ఫీ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య.. కారణం అదేనా..? (వీడియో)
X

దిశ, హుజూర్‌నగర్: సెల్ఫీ వీడియో తీస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి‌న సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురుగుల‌ మందు తాగుతూ మృతుడు సెల్ ఫోన్‌తో తీసుకున్న వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గువ్వల పవన్(20) పోటీ పరీక్షలకు సిద్దమవుతూ హైదరాబాద్ లో ఉంటున్నాడు‌.

పవన్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. కాగా నాలుగు రోజుల క్రితం‌ ఆ యువతి మరణించడంతో పవన్ శుక్రవారం గ్రామానికి వచ్చాడు. అదేరోజు మొబైల్‌లో సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం సూర్యాపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ప్రియురాలి‌ మరణాన్ని తట్టుకోలేకనే పురుగుల మందు తాగి పవన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది‌.

Next Story