- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్‌లో మాయం కానున్న ట్రెండింగ్ ట్యాబ్.. అదే కారణమా?
యూట్యూబ్ (Youtube) వాడే వారికి ‘ట్రెండింగ్’ ట్యాబ్ అనేది చాలా సుపరిచితమైన సెక్షన్.

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ (Youtube) వాడే వారికి ‘ట్రెండింగ్’ ట్యాబ్ అనేది చాలా సుపరిచితమైన సెక్షన్. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌పై ఏ వీడియోలు పాపులర్‌గా ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడానికి ఈ ట్యాబ్ ఉపయోగపడేది. కానీ త్వరలో ఈ ట్రెండింగ్ ట్యాబ్ ఇక కనిపించదు. యూట్యూబ్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్నివారాల్లో ఈ ట్యాబ్‌ను పూర్తిగా తొలగించనున్నారు. కానీ ఎందుకు తీసేస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు.
అదే కారణమా?
ఇటీవలి కాలంలో యూజర్లు పర్సనలైజ్డ్ కంటెంట్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంటే, వారివారి అభిరుచులకు తగ్గట్టుగా యూట్యూబ్ సూచించే వీడియోలు ఎక్కువగా చూసే అవకాశం పెరిగింది. అందుకే ట్రెండింగ్ ట్యాబ్‌కి వచ్చే ట్రాఫిక్ గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టింది. ట్రెండింగ్ ట్యాబ్ ద్వారా సాధారణంగా వైరల్ వీడియోలు, మ్యూజిక్ ట్రాక్స్, న్యూస్ హైలైట్స్ వంటి వాటిని చూసేవారు. కానీ ఇప్పుడు వాటిలో చాలా వాటిని యూజర్ హోమ్‌పేజీ లేదా సబ్‌స్క్రిప్షన్ ఫీడ్‌లోనే అందుబాటులో ఉంచుతోంది యూట్యూబ్. అందువల్ల ప్రత్యేకంగా ట్రెండింగ్ అనే విభాగం అవసరం లేదనే అభిప్రాయంతో ఈ ట్యాబ్‌ను తొలగించే దిశగా నిర్ణయం తీసుకున్నారు.
2015లో ప్రారంభమైన ఈ ఫీచర్‌కు చివరి ఘడియలు
2015లో పరిచయమైన ట్రెండింగ్ ట్యాబ్, గత 5–6 ఏళ్లలో గణనీయంగా వినియోగం తగ్గినట్లు యూట్యూబ్ డేటా సూచిస్తున్నట్లు సమాచారం. దాంతో యాప్ నావిగేషన్‌ను మరింత క్లియర్‌గా, యూజర్-సెంట్రిక్‌గా రూపొందించేందుకు ఈ సెక్షన్‌ను తొలగించనున్నారు. కంటెంట్ క్రియేటర్లకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే అయినా.. యూజర్‌కు అవసరమైన కంటెంట్‌ను వేగంగా చూపించడమే యూట్యూబ్ ప్రాధాన్యం అవుతుందని చెప్పొచ్చు.






