రికార్డు స్థాయిలో అకౌంట్లను నిషేధించిన ‘X(ట్విట్టర్)’

by Disha Web Desk 17 |
రికార్డు స్థాయిలో అకౌంట్లను నిషేధించిన ‘X(ట్విట్టర్)’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘X(ట్విట్టర్)’ ఇండియాలో జులై 26- ఆగస్టు 25 మధ్య రికార్డు స్థాయిలో 12,80,107 ఖాతాలను నిషేధించింది. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 2,307 ఖాతాలను తొలగించారు. దీంతో మొత్తంగా 12.82 లక్షల ఖాతాలను నిషేధించారు. చిన్న పిల్లల లైంగిక వేధింపులు, అడల్ట్ కంటెంట్ ఇతర హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన ఖాతాలను నిషేధించినట్లు పేర్కొన్నారు.

వినియోగదారుల నుంచి 1,467 ఫిర్యాదులను స్వీకరించగా, సమీక్ష తరువాత 10 ఖాతాలపై సస్పెన్షన్‌ను తొలగించి మిగిలిన ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కంపెనీ తన నెలవారీ నివేదికలో కొత్త IT నియమాలు, 2021కి అనుగుణంగా ఖాతాల ఫిర్యాదులు, వాటి పరిష్కారాలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

భారత్ నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయని వాటిలో దుర్వినియోగం/వేధింపులు (1,267), తర్వాత ద్వేషపూరిత ప్రవర్తన (62), పిల్లల లైంగిక దోపిడీ (43), ప్రైవసీ ఉల్లంఘన (27) గురించి ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇంతకుముందు జూన్-జులై వ్యవధిలో, X దేశంలో రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను నిషేధించింది. మే 26-జూన్ 25 మధ్య 5,44,473 ఖాతాలను నిషేధించింది.

Next Story

Most Viewed