- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్లోకి సెల్ఫ్ డ్రైవింగ్ బైక్... అదిరిపోయే ఫీచర్స్ ఇవే ?
మార్కెట్లోకి రకరకాల వాహనాలు వస్తున్నాయి. మొదట్లో పెట్రోల్ ( Petrol ), డీజిల్ తో ( Diesel) నడిచే వాహనాలు మార్కెట్ లోకి

దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లోకి రకరకాల వాహనాలు వస్తున్నాయి. మొదట్లో పెట్రోల్ ( Petrol ), డీజిల్ తో ( Diesel) నడిచే వాహనాలు మార్కెట్ లోకి వచ్చేవి. కానీ కాలం మారిన కొద్దీ... కొత్త తరహా టూవీలర్ ( Two wheeler ) అలాగే కార్లు మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ( Electric vehicles) జోరు కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో షావోమీ ( Xiaomi ) సరికొత్త బైక్ ను తీసుకువస్తోంది. సెల్ఫ్ బ్యాలెన్స్డ్ టూవీలర్ ( Self Balanced Two wheeler )వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చేసింది షావోమీ. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెల్ఫ్ బ్యాలెన్స్ టూవీలర్... వాహనం.. అచ్చం కారు లాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది.
మనం డ్రైవింగ్ చేయాల్సిన పని ఉండదు. బైక్ పైన కూర్చొని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మన గమ్యస్థానాలకు ఆ బైక్ తీసుకువెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ సెల్ఫ్ బ్యాలెన్స్ బైక్.. గైరోస్కోప్ ( Gyroscope ) ఫ్రేమ్ ద్వారా నడుస్తుంది. ఈ గైరోస్కోప్ ఉండటం వల్ల.. స్కూటర్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అసలు బైక్ కింద పడదు. కేవలం దానిపైన మనం కూర్చుంటే సరిపోతుంది. అలాగే ఈ స్కూటర్ కు కెమెరాతో పాటు సెన్సార్లు కూడా ఉంటాయి. ఇవి ఏఐ ( AI ) టెక్నాలజీతో పని చేస్తాయి. బైక్ రోడ్డుపైన వెళ్తున్న నేపథ్యంలో.. ఎదురుగా మనిషి లేదా ఇతర వాహనాలు వస్తే సెన్సార్ యాక్టివ్ అయి.. బైక్ సైడ్ ఇస్తుంది. అలాగే.. స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడా సెన్సార్లు యాక్టివ్ అయి... బైక్ స్లోగా వెళుతుంది. అలా ఏ ఐ టెక్నాలజీ తో పాటు... గైరోస్కోప్ సిస్టం ద్వారా ఈ బైక్ నడుస్తుంది. అయితే ఈ బైక్ వివరాలు ఇంకా.. ప్రకటించలేదు. త్వరలోనే.. ఈ బైక్ పూర్తి వివరాలు రివీల్ కానున్నాయి.






