Xiaomi Holi Discount: Redmi ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. తక్కువ ధరకే అదిరే కెమెరా మోడల్‌!

by Vennela |

Xiaomi Holi Discount: మీరు కొత్త ఫెన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.

Xiaomi Holi Discount: Redmi ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. తక్కువ ధరకే అదిరే కెమెరా మోడల్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: Xiaomi Holi Discount: మీరు కొత్త ఫెన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. Xiaomi Redmi స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక హోలీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్‌లో, మీరు Redmi మిడ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

హోలీ (Xiaomi Holi Discount Offer)సందర్భంగా షియోమి కొత్త ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ తాజా Redmi Note 14 నుండి గత సంవత్సరం లాంచ్ అయిన 200MP కెమెరాతో Redmi Note 13 Pro వరకు, ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు Xiaomi ఈ హోలీ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ సేల్‌లో రెడ్‌మి 13C 4G వంటి బడ్జెట్ ఫోన్‌లపై కూడా కంపెనీ అనేక రకాల ఆఫర్‌లను అందిస్తోంది. Xiaomi ఈ హోలీ ఆఫర్‌లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రెడ్‌మి నోట్ 14 5G:

ఈ ఏడాది లాంచ్ చేసిన Redmi తాజా నోట్ సిరీస్‌ను మీరు భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. Redmi Note 14 5G ప్రారంభ ధర రూ.18,999. కంపెనీ ఈ 6GB + 128GB ప్రారంభ వేరియంట్ ఇప్పుడు రూ.17,999 కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్, ఇతర డిస్కౌంట్ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

5జి:

మీరు ఈ Redmi బడ్జెట్ ఫోన్‌ను కేవలం రూ.7,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుత లిస్టెడ్ ధర రూ.7,999. హోలీ సందర్భంగా, ఫోన్ కొనుగోలుపై రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ 6.74-అంగుళాల పెద్ద 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ వంటి అనేక శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది.

రెడ్‌మి నోట్ 13 ప్రో 5G:

హోలీ సందర్భంగా నిర్వహించే సేల్‌లో Redmi 200MP కెమెరా ఫోన్ కూడా చాలా తక్కువ ధరకు లభిస్తోంది. దీని 12GB RAM + 256GB వేరియంట్ అమెజాన్‌లో కేవలం రూ.18,659కి లిస్ట్ చేసి ఉంది. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999కి లిస్ట్ చేసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్(Amazon), ఫ్లిప్ కార్ట్(Flipkart) లో ఈ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్‌తో సహా అనేక ఇతర ఆఫర్‌లు అందిస్తోంది.

Next Story