- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ARATTAI APP: వాట్సాప్‌ను మించిన ఫీచర్స్‌తో స్వదేశీ యాప్ అరట్టై.. స్పెషల్ ఏంటంటే?
వాట్సాప్ ప్రతిఒక్కరి ఫోన్లలో ఖచ్చితంగా ఉండే యాప్. మెసేజింగ్ యాప్స్ లో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చాయి కానీ నిలబడలేకపోయాయి. కాగా ఇప్పుడు వాట్సాప్‌ను బీట్ చేసేందుకు దేశీయ కంపెనీ జోహోకు చెందిన అరట్టై మెసేజింగ్ యాప్ వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్ ప్రతిఒక్కరి ఫోన్లలో ఖచ్చితంగా ఉండే యాప్. మెసేజింగ్ యాప్స్ లో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చాయి కానీ నిలబడలేకపోయాయి. కాగా ఇప్పుడు వాట్సాప్‌ను బీట్ చేసేందుకు దేశీయ కంపెనీ జోహోకు చెందిన అరట్టై మెసేజింగ్ యాప్ వచ్చింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లాంటి వ్యక్తి స్వయంగా ప్రమోట్ చేయడంతో అరట్టై పేరు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే దీనిని ప్లే స్టోర్ లో 50 లక్షలకు పైగా మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఫీచర్స్ లోనూ వాట్సాప్ కు మించి ఇందులో ఉండటంతో చాలా మందిని అరట్టై ఆకర్షిస్తోంది. అరట్టైలో మీటింగ్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఆప్షన్ వాట్సాప్ లోనూ ఉంది. కానీ అరట్టైలో పూర్తైన మీటింగ్స్ సమాచారం కూడా సేవ్ అవుతుంది. అదే విధంగా ఇందులో మీడింగ్స్ ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో ట్యాగ్ చేస్తే ఆ గ్రూప్ ఓపెన్ చేసి చూడాలి. కానీ అరట్టై లో మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ చేసిన సందేశాలన్నీ ఒకేదగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రూప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్ లో సేఫ్టీ ఉన్నప్పటికీ యూజర్ల డేటాను టార్గెట్ అడ్వర్టైజింగ్ కు వినియోగించుకుంటుంది. కానీ అరట్టై అలా డేటాను వినియోగించుకోదు. వాట్సాప్ లో మెటా ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. దాని వల్ల ఏఐ ఇంటరాక్షన్ కారణంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ అరట్టై లో ఏఐ లేకపోవడం వల్ల యాప్ సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది.






