పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ ఎంత ఖరీదైనదో..? 1GB డేటా ధరెంతో తెలుసా..?

by Bhanu |   (  Updated:2025-05-12 14:54:31  IST  )

ఇంటర్నెట్ సరికొత్త యుగాన్ని తెరలేపిన యుగంలో మన భారతదేశం అతి తక్కువ ధరలకు డేటాను అందిస్తున్న దేశాలలో అగ్రస్థానంలో నిలుస్తోంది.

పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ ఎంత ఖరీదైనదో..? 1GB డేటా ధరెంతో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్నెట్ సరికొత్త యుగాన్ని తెరలేపిన యుగంలో మన భారతదేశం అతి తక్కువ ధరలకు డేటాను అందిస్తున్న దేశాలలో అగ్రస్థానంలో నిలుస్తోంది. కానీ మన పక్క దేశమైన పాకిస్తాన్ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వన్ జిబి ఇంటర్నెట్ డేటాకు పాకిస్తాన్ వాసులు మనకంటే రెండింతలు ఖర్చు పెడుతున్నారు. అవును, మన దేశంలో 1 జిబి డేటా సగటున రూ. 12–14కి లభిస్తే, పాకిస్తాన్లో అదే డేటాకు రూ. 30 వరకు చెల్లించాల్సి వస్తోంది. అంటే అక్కడి ప్రజలు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లను వాడడానికి మనకంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తోంది.

పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ ఖర్చులు ఇలా ఉన్నాయంటే, రోజుకు 1 జిబి వాడే వారు నెలకు దాదాపు రూ. 900 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే మన దేశంలో అయితే ఇదే ఖర్చు రూ. 300, 400 మధ్యలో ఉంటోంది. ఈ కారణంగా పాకిస్తాన్ యువత డిజిటల్ జీవితానికి దూరంగా ఉంటున్నారు. వారు ఆన్‌లైన్ తరగతులు, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో బాంగ్లాదేశ్ పరిస్థితి మాత్రం పాకిస్తాన్‌తో పోల్చితే కొంత మెరుగ్గానే ఉంది. అక్కడ 1 జిబి డేటా ధర సుమారు రూ. 26 మాత్రమే. దక్షిణాసియాలో అత్యంత ఖరీదైన డేటా అందిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటిగా మారిపోయింది.

ప్రపంచంలో అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ అందిస్తున్న దేశం ఇజ్రాయిల్. అక్కడ 1 జిబి డేటా ఖర్చు కేవలం రూ. 3.42 మాత్రమే. రెండో స్థానంలో ఉన్న ఇటలీలో రూ. 9.91కు డేటా లభిస్తోంది. ఇక పాకిస్తాన్‌లో జాజ్, టెలినార్, జోంగ్, యూఫోన్, SCOm వంటి టెలికాం కంపెనీలు సేవలందిస్తున్నా, డేటా ధరలు మాత్రం వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ తరహాలో చూస్తే.. డేటా ధరలు అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో స్పష్టంగా తెలుస్తోంది. ఇండియాలో తక్కువ ధరలు డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకెళ్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఆ ధరల భారంతో వెనుకబడుతోంది.




Next Story