- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Whatsapp: ఆపిల్, ఆండ్రాయిడ్ యూజర్‌లకు షాక్.. రేపటి నుండి ఈ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు బంద్
ఆండ్రాయిడ్ (Android) అయినా ఐఫోన్ (I phone) అయినా ప్రతిఒక్కరి ఫోన్‌లో వాట్సాప్(Whatsapp) కచ్చితంగా కనిపిస్తుంది. యూత్ నుండి ముసలివాళ్ల వరకు ప్రతిఒక్కరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్ (Android) అయినా ఐఫోన్ (I phone) అయినా ప్రతిఒక్కరి ఫోన్‌లో వాట్సాప్(Whatsapp) కచ్చితంగా కనిపిస్తుంది. యూత్ నుండి ముసలివాళ్ల వరకు ప్రతిఒక్కరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ఫోన్‌లో జూన్ ఒకటి నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఓల్డ్ మోడల్స్‌లో ఈ సేవలు నిలిచిపోతాయి. కొత్తగా తీసుకువస్తున్న అప్డేట్స్ కారణంగా ఓల్డ్ ఫోన్లలో మెటా వాట్సాప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆపిల్ ఫోన్ల (Apple phones)లో ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ ఎస్ఈ మొదటి జనరేషన్ ఫోన్‌లలో ఇకపై వాట్సాప్ పని చేయదు. అంతే కాకుండా ఆండ్రాయిడ్ విషయానికి వస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 4, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3, సోని ఎక్స్‌పేరియా జెడ్1, ఎల్‌జీ జీ 2, హువాయి అసెండ్ పీ 6, మోటో జీ ఫస్ట్ జనరేషన్, మోటరోలా రాజర్ హెచ్డీ, మోటో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఇకపై వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
వినియోగదారుల భద్రత, మరిన్ని అప్డేట్స్ కారణంగా పలు ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని మెటా ప్రకటించింది. ఒకవేళ ఈ ఫోన్‌లో వాట్సాప్ వినియోగించాలి అనుకుంటే వినియోగదారులు తమ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. సందేశాలు పంపుకోవాలన్నా, ఫైల్స్ పంపుకోవాలన్నా లేదా ఫోటోలు మరియు ఆడియో వీడియోలు పంపుకోవాలనుకున్నా వాట్సాప్ ఉండాల్సిందే. కాబట్టి మీరూ ఈ మోడల్స్ వినియోగిస్తుంటే వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవడం లేదా కొత్త ఫోన్ తీసుకోవడం మంచింది.






