వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్..మొబైల్ నంబర్‌తో పనిలేకుండానే

by velandi.Saikiran |

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్.

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్..మొబైల్ నంబర్‌తో పనిలేకుండానే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వాట్సాప్ ( WhatsApp ) వినియోగదారులకు బిగ్ అలర్ట్. వాట్సప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ వచ్చిన నేపథ్యంలో ఇక పైన మీ మొబైల్ నెంబర్ తో పని లేకుండా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చన్నమాట.

మొబైల్ నెంబర్ ప‌నిలేకుండానే సేవ‌లు

దీని వల్ల మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, IOS యూజర్లకు దశల వారీగా ఈ సదుపాయం లభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు మీ నెంబర్ కనిపించదు కాబట్టి.. ఇది యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత ఇవ్వనుంది అన్నమాట. ఇక ఈ ఫీచర్ వచ్చిన నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story