- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WhatsApp Steganography Scam: WhatsApp స్టిగనోగ్రఫీ స్కామ్ అంటే ఏంటి..? ఈ మెసేజ్ క్లిక్ చేశారో మీ అకౌంట్లో డబ్బులు సున్నా..!!
WhatsApp Steganography Scam: టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: WhatsApp Steganography Scam: టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా సరికొత్త స్కామ్ వాట్సాప్ పేరిట జరుగుతోంది. ఈ స్కామ్ లో సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే మీ అకౌంట్లో ఉన్న డబ్బులను కాజేసే అవకాశం ఉంది. అవును మీరు వింటున్నది నిజమే. రమేష్ ఓ రోజు ఆఫీసులో ఉండగా అతని ఫోన్ కి అనుకోకుండా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. గుర్తుతెలియని మెసేజ్ నుంచి వచ్చింది. అందులో ఒక ఫోటో ఉంది. ఎవరు పంపారో తెలియదు ఆ ఫోటోలో ఏం ఉందా అని క్లిక్ చేసి చూశాడు. అంతలోనే అతని నుంచి డబ్బు ఒక్కసారిగా మాయం అయింది. అంతే అతను షాక్ గురయ్యాడు.
అదే WhatsApp స్టిగనోగ్రఫీ స్కామ్. ఇక్కడ స్కామర్ ఏం చేస్తాడంటే మనకి WhatsAppట్ లో ఒక ఫోటో పంపిస్తాడు. మనం కనుక ఆ ఫోటోని డౌన్లోడ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో ఎంతైతే డబ్బు ఉందో అదంతా ఖాళీ అయిపోతుంది. రీసెంట్ గా ఇలా చాలా మంది WhatsAppట్ లో వచ్చిన ఫోటోస్ ని డౌన్లోడ్ చేయడం వలన చాలా డబ్బుని కోల్పోయారు. ఎందుకంటే స్కామర్ ఇక్కడ మనకి పంపేది నార్మల్ ఫోటో కాదు. బైనరీ కోడ్ తో కూడిన ఫోటోని స్కామర్ పంపిస్తాడు. దీంట్లో మాల్వేర్ అయితే ఉంటుంది.
సో ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేయగానే మాల్వేర్ అన్నది మన ఫోన్ లో ఇనిస్టాల్ అయిపోతుంది. సో స్కామర్ కి మన బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఫ్యూచర్ లో వచ్చే ఓటీపీ కూడా అతనికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అకౌంట్ లో ఉన్న డబ్బుని కాజేస్తూ ఉన్నారు. స్కామర్స్ అందుకనే కొత్త నంబర్స్ నుంచి ఏమైనా ఫొటోస్ వస్తే అస్సలు డౌన్లోడ్ చేయకండి. చాలా మంది WhatsApp లో ఆటో డౌన్లోడ్ ని ఎనేబుల్ చేసుకుంటారు. అంటే WhatsApp లో ఏదైనా ఫోటో వస్తే మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి.
ఇలాంటి మోసాలా నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే WhatsAppట్ లో స్టోరేజ్ ఎండ్ డేటా ని క్లిక్ చేయండి. ఇక్కడ వెంటనే ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ని తీసేయండి. ఇలాంటి కేసులు రీసెంట్ గా ఎన్నో ఎన్నో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించిన బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. కనుక మీకు అలాంటి నెంబర్ ల నుంచి ఏదైనా మెసేజ్ రాగానే వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేసేయండి. పొరపాటున కూడా ఆ ఫోటో క్లిక్ చేయవద్దు.






