6000 బ్యాటరీతో వివో నుంచి సరికొత్త మొబైల్.. ధర ఎంతంటే ?

by velandi.Saikiran |

మూడు వేరియంట్స్ రానున్నాయి. 4gb+64gb స్టోరేజ్ ఉన్న మొబైల్ బేసిక్ మోడల్. ఈ మోడల్ మొబైల్ ద్వారా 11,000 రూపాయలుగా

6000 బ్యాటరీతో వివో నుంచి సరికొత్త మొబైల్.. ధర ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో వివో బ్రాండ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఈ కంపెనీ నుంచి తక్కువ ధరలో సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా చాలా మొబైల్స్ తీసుకువచ్చింది వివో. అయితే తాజాగా ఈ కంపెనీ నుంచి వివో వై 19S ( Vivo Y19s 5G) మొబైల్ ఫోన్ లాంచ్ అయింది. 6.74 ఇంచుల డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ మీడియా టెక్ డిమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో పని చేయనుంది.

ఇందులో మూడు వేరియంట్స్ రానున్నాయి. 4gb+64gb స్టోరేజ్ ఉన్న మొబైల్ బేసిక్ మోడల్. ఈ మోడల్ మొబైల్ ద్వారా 11,000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. 4gb+128gb మోడల్ మొబైల్ ధర 12 వేల రూపాయల వరకు ఉంటుంది. 6gb+128gb మోడల్ ధర 13,499 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇక Vivo Y19s 5G మొబైల్ కు 6000 బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 15 w ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 199 గ్రాములు ఉంటుంది. 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాలు అందిస్తున్నారు. అలాగే సెల్ఫీల కోసం 5 మెగాపిక్సల్ కెమెరాను కంపెనీ అందిస్తోంది.

Next Story