Vivo V60: వివో నుంచి సరికొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివో ( Vivo) నుంచి... సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

Vivo V60: వివో నుంచి సరికొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివో ( Vivo) నుంచి... సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. Vivo V60 పేరుతో ఈ కొత్త మొబైల్ తీసుకువస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ ఆగస్టు 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. మరి ఈ ఫోన్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.... మూడు కలర్స్ లో ఈ మొబైల్ ఫోన్ లభించబోతోంది.

గోల్డ్, బ్లూ, గ్రే కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక ఈ వివో మొబైల్ ఫోన్ 50 మెగాపిక్సల్ కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం కూడా మంచి కెమెరాలు అందిస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6500 mah గా ఉంది. 90 W ఫ్లాష్ చార్జ్ కు మాత్రమే ఈ మొబైల్ ఫోన్ మద్దతు ఇస్తుంది అని కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్ ఫోన్ ఇండియాలోనే అత్యంత సన్ననైన మొబైల్ గా కంపెనీ పేర్కొంది.

Next Story