భారత్‌-పాక్‌ యుద్ధం.. ఇంటర్నెట్‌ నిలిచిపోయినా మీరు వాట్సాప్ వాడొచ్చు.. ఎలాగో తెలుసా.?

by Kavya |   ( Updated:2025-05-09 10:32:05.0  )
భారత్‌-పాక్‌ యుద్ధం.. ఇంటర్నెట్‌ నిలిచిపోయినా మీరు వాట్సాప్ వాడొచ్చు.. ఎలాగో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్‌: ఒకవేళ నిజంగానే భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితి వస్తే, మొదట దెబ్బతినేది ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్సే. ఎందుకంటే అలాంటి సమయాల్లో, పుకార్లు వ్యాప్తి చెందకుండా ఆపడానికి ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్, సోషల్ మీడియా , వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తాయి. కానీ, ఒక శుభవార్త ఏమిటంటే, ఇంటర్నెట్ లేకపోయినా మీరు వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు.. దీనికి సహాయం చేయడానికి వాట్సాప్‌లో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది, దాని పేరు "ప్రాక్సీ ఫీచర్".

ప్రాక్సీ ఫీచర్ అంటే ఏమిటో తెలుసా..?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మీరు వాట్సాప్‌ను ఉపయోగించగల ఒక అద్భుతమైన మార్గం ఈ ప్రాక్సీ. మీ దేశంలో లేదా నగరంలో వాట్సాప్‌ను బ్లాక్ చేస్తే, ఈ ప్రాక్సీ సర్వర్ సహాయంతో, వాట్సాప్ పనిచేస్తున్న అసలు సర్వర్‌కు ఒక రహస్య మార్గం ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ప్రాక్సీ అనేది వాట్సాప్‌ను మళ్ళీ పని చేయించడానికి ఒక రహస్యమైన సొరంగం లాంటిది!

మరి ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ను ఉపయోగించడానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. దీని కోసం మీరు ప్రాక్సీ ఫీచర్‌ను ఆక్టివేట్ చేసుకోవాలి. అంతేకాదు, మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో వెబ్ వాట్సాప్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మొదటగా, మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాక్సీ ఫీచర్‌ను ఆన్ చేయండి. దీనికోసం మీరు గూగుల్ చేయవచ్చు. తర్వాత, మీ వాట్సాప్ అప్లికేషన్‌ను ప్రాక్సీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండకూడదు..!

ఈ ప్రాక్సీ ఫీచర్ మీ వ్యక్తిగత గోప్యత, భద్రతకు ఏమాత్రం హాని కలిగించదు. మీ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి. అయితే, మీరు ఏదైనా థర్డ్-పార్టీ ప్రాక్సీని ఉపయోగిస్తే, మీ IP అడ్రస్‌ను ఆ ప్రాక్సీ అందించిన వారితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రాక్సీ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూడండి:

మీ ఇంటర్నెట్ లేదా వాట్సాప్ సర్వర్‌ను బ్లాక్ చేసినప్పుడు, మీరు వేరే దేశంలో పనిచేస్తున్న ప్రాక్సీ సర్వర్‌ను మీ వాట్సాప్‌కు జోడించవచ్చు. ఇది మీ వాట్సాప్‌ను ఆ ప్రాక్సీ సర్వర్‌కు కనెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత మీరు యథావిధిగా మెసేజ్‌లు పంపుకోవచ్చు. అయితే, మీ దేశంలోని సర్వర్ నుండి వేరే దేశంలోని సర్వర్‌కు కనెక్ట్ అవ్వడం కొంచెం రిస్క్‌తో కూడుకున్నదని గుర్తుంచుకోండి.

వెబ్ వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్..!

మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకో సూపర్ గుడ్ న్యూస్! ఇప్పటివరకు వాట్సాప్ యూజర్లు కేవలం తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచే వాయిస్ , వీడియో కాల్స్ చేయగలిగేవారు. కానీ ఇప్పుడు, కోట్లాది వెబ్ వాట్సాప్ యూజర్లు కూడా ఈ అద్భుతమైన ఫీచర్‌ను పొందనున్నారు..! ఇంతకుముందు వెబ్‌లో కాల్స్ చేయడానికి విండోస్ లేదా మాక్‌లో ప్రత్యేక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, వాట్సాప్ వెబ్ యూజర్లందరూ ఎలాంటి అప్లికేషన్ సహాయం లేకుండా డైరెక్ట్‌గా వాయిస్ , వీడియో కాల్స్ చేసుకోవచ్చు.! ఇది నిజంగా బంపర్ ఆఫర్..

కాబట్టి, పరిస్థితులు ఎలా ఉన్నా, మీ వాట్సాప్ కనెక్షన్ మాత్రం తెగిపోదు.. ప్రాక్సీ ఫీచర్, వెబ్ కాల్స్ ఫీచర్‌తో, మీరు ఎల్లప్పుడూ మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయి ఉండవచ్చు. టెక్నాలజీ ఎంత అద్భుతాలు చేస్తుందో కదా...





Next Story

Most Viewed