సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే వీడియోగా మారుస్తుంది.. పికా ల్యాబ్స్ కొత్త ఏఐ యాప్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-15 12:09:13  IST  )

యాప్‌ను ఉపయోగించి, వినియోగదారులు ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని చిన్న వీడియోగా మార్చుకోవచ్చు. అలాగే, టెక్ట్స్, ప్రాంప్ట్‌ల ద్వారా కూడా వీడియోలు రూపొందించుకోవచ్చు

సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే వీడియోగా మారుస్తుంది.. పికా ల్యాబ్స్ కొత్త ఏఐ యాప్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) నడిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. విద్య, వైద్య, వాణిజ్యం, వినోదం, రవాణా వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐని విపరీతంగా వాడుతున్నారు. ఇది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానంగా మాత్రమే కాకుండా మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. అందుకే దిగ్గజ టెక్ సంస్థలు సైతం ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. కొత్త కొత్త ఏఐ టూల్స్‌ను (AI Tools) అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా (America) కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు (Palo Alto) చెందిన ఏఐ స్టార్టప్ పికా ల్యాబ్స్ (Pika Labs) కొత్త ఏఐ సోషల్ మీడియా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పికా సోషల్ AI వీడియో యాప్‌ను ఉపయోగించి, వినియోగదారులు ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని చిన్న వీడియోగా మార్చుకోవచ్చు. అలాగే, టెక్ట్స్, ప్రాంప్ట్‌ల ద్వారా కూడా వీడియోలు రూపొందించుకోవచ్చు. వీడియోలోని అంశాలను మార్చేందుకు కస్టమైజేషన్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీడియో క్రియేట్ చేసిన అనంతరం దాన్ని సోషల్ ఫీడ్ ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అయితే, ఈ యాప్ ప్రస్తుతం ఐఓఎస్ (iOS) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది.

https://x.com/pika_labs/status/1954935844936024476

Next Story