- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
I PHONE 16 PLUS: ఐఫోన్ 16 ప్లస్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్..ఏకంగా 20వేలు తగ్గింపు!
ఐఫోన్ 16 ప్లస్ (i phone 16 plus) ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ లో సైతం ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.79,000 ఉండగా జియో మార్ట్ (jio mart)లో దాదాపు రూ.20వేల డిస్కౌంట్ తో ఐఫోన్ 16 ప్లస్ అందుబాటులో ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ యూజర్ల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. చాలా మంది ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉండటంతో కొత్త ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. అయితే ఒకవేళ మీ చాయిస్ ఐఫోన్ అయితే మాత్రం ఐఫోన్ 16 ప్లస్ (i phone 16 plus) ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ లో సైతం ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.79,000 ఉండగా జియో మార్ట్ (jio mart)లో దాదాపు రూ.20వేల డిస్కౌంట్ తో ఐఫోన్ 16 ప్లస్ అందుబాటులో ఉంది.
జియో మార్ట్ లో ఫోన్ అసలు ధర రూ. 67,900 చూపిస్తుంది. అయితే జియో మార్ట్ లో ఐఫోన్స్ కొనుగోలు చేసి, ఐసీఐసీఐ కార్డ్ ద్వారా బిల్ కడితే 15శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ లెక్కన ఐఫోన్ 16 ప్లస్ పై మరో 10,185 డిస్కౌంట్ వస్తోంది. దీంతో ఈ ఫోన్ మీకు కేవలం రూ.57,715లకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ (flipcart), అమెజాన్(amazon)తో పోలిస్తే దాదాపు రూ.20వేలు తక్కువగా ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఐఫోన్ 16 ధర 70వేల వరకు ఉంది.
అంటే దాని కంటే 16ప్లస్ చాలా తక్కువకు వస్తుంది. ఐఫోన్ 16 కంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండటమే కాక, డిస్ ప్లే సైతం పొడవుగా ఉంది. ఈ ఫోన్ మిగితా ఫీచర్స్ విషయానికి వస్తే... 128 GB Internal Memory ఉంది. 6.7 inch Super Retina XDR Display అందుబాటులో ఉంది. రేర్ కెమెరా 48 మెగాపిక్సల్, 12 MP Ultra Wide Camera ఉంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సల్ Autofocus with Focus Pixelsతో దీనిని తీసుకువచ్చారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే A18 Chip, New 6-core CPU with 2 performance and 4 efficiency cores ప్రాసెసర్ ఇందులో ఉంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉండగా వైర్ లెస్ చార్జింగ్ కు సైతం సపోర్ట్ చేస్తుంది.






