రూ.20వేలకు మంచి మొబైల్ రాదని ఎవరైనా మీతో అంటే ఈ ఆర్టికల్‌ చూపించండి.. చీప్‌ అండ్‌ బెస్ట్ మొబైల్స్!

by Vennela |
రూ.20వేలకు మంచి మొబైల్ రాదని ఎవరైనా మీతో అంటే ఈ ఆర్టికల్‌ చూపించండి.. చీప్‌ అండ్‌ బెస్ట్ మొబైల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: Smart Phone Under 20000: స్మార్ట్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అదికూడా మీ బడ్జెట్ లూపే కొనేందుకు చూస్తున్నారా. అయితే ఈ ఆర్టికల్ మీ కోసమనే. రూ. 20వేలకే మీ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ జాబితా ఇక్కడ ఉంది. చూడండి.

కొత్త స్మార్ట్ ఫోన్(Smart Phone) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ ఆర్టికల్ చదవండి. ఎందుకంటే కేవలం రూ. 20వేల బడ్జెట్ లోనే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అంత తక్కువ ఏం వస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే రూ. 20వేలలోపు లభించే ఈ స్మార్ట్ ఫోన్లలో సూపర్ కూల్ ఫీచర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్స్ జాబితాను ఓ సారి చూద్దాం.

మోటో జీ 85 5జీ : (Moto G85 5G)

మంచి పనితీరుతో మోటో జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. మూటూ జీ 85 5జీ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఇందులో ఉన్నాయి. 50మెగాపిక్సెల్ సోనీ లైటియా 600 మెయిన్ కెమెరా , 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఇందులో ఉన్నాయి.

ఐక్యూ జెడ్ 9 5జీ :(iQOO Z9 5G)

ఈ స్మార్ట్ ఫోన్ గతేడాది మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఐక్య జెడ్ 9 5జీలో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎస్ 882 ఓఐఎస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇది రూ. 24, 999 ధరకు లాంచ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ లో రూ. 20వేల లోపు లభిస్తోంది.

రెడ్ మీ నోట్ 14 5జీ : (Redmi Note 14 5G)

ఆకట్లుకునే డిజైన్, అధునాతనమైన ఫీచర్లతో కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ఇది. రెడ్ మీ నోట్ 14 5జీలో మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 6జీబీ వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. దీనిలో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రెడ్ మీ నోట్ 14 5జీని రూ. 20,000లోపు కొనుగోలు చేయవచ్చు.

హెచ్ఎండీ ఫ్యూజన్ 5జీ : (HMD Fusion 5G)

రూ. 20, 000లోపు స్మార్ట్ ఫోన్ జాబితాలో ఇది కూడా ఒకటి. గతేడాది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైన ఈ హెచ్ఎండీ ఫ్యూజన్ 5జీలో స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 ప్రాసెసర్, 8జీబీ వరకు ర్యామ్ ను అందించారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 20, 000 లోపు ధరకే మీరు కొనుగోలు చేయవచ్చు.

సీఎంఎఫ్ ఫోన్ 1 5జీ :(CMF Phone 1 5G)

బడ్జెట్ లోపు కావాలనుకునే కొనుగోలు దారుల కోసం లాంచ్ చేసిన నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఫస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ఇది. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన ఫర్మామెన్స్ కోసం అనేక డిజైన్ కస్టమైజేషన్ ఆప్షన్స్ , మీడియా టెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ తో వస్తుంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 మంచి డ్యూయల్ కెమెరా సెటప్ తో ఇది వస్తుంది. దీని యూజర్లు హై క్వాలిటీ చిత్రాలను క్లిక్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed