- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPHONE 17 PRO కెమెరాను సైతం బీట్ చేసే 5 అండ్రాయిడ్ ఫోన్స్ ఇవే
చాలా మంది ఐఫోన్ అంటే రక్షణతో పాటు కెమెరా అద్భుతంగా పనిచేస్తుందని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల కెెమెరాలు సైతం ఐఫోన్‌తో పోటీ పడుతుంటాయని చాలా మందికి తెలియదు.

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది ఐఫోన్ అంటే రక్షణతో పాటు కెమెరా అద్భుతంగా పనిచేస్తుందని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల కెెమెరాలు సైతం ఐఫోన్‌తో పోటీ పడుతుంటాయని చాలా మందికి తెలియదు. రీసెంట్‌గా లాంఛ్ అయిన ఐఫోన్ 17 ప్రోకి కూడా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల కెమెరాలు గట్టి పోటీ ఇస్తాయి. అవేంటో చూద్దాం.. Google Pixel 10 Proలో బెస్ట్ కెమెరా వస్తుంది. ఇందులో 50MP+48MP+48MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 8K వీడియో రికార్డింగ్ కు సైతం సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో 42MP ఫ్రంట్ కెమెరా ఉంది.
Oppo Find X8 Ultra కెమెరా కూడా టెక్ లవర్స్ మనసు దోచేస్తోంది. ఇందులో dual periscope lensesతో 50MP కెమెరా సెటప్ ఉంది. 3x మరియు 6x జూమింగ్ కు ఇది సపోర్ట్ చేస్తుంది. Oppo నుండి మరో మొబైల్ Oppo Find X8 Pro సైతం ఐఫోన్ 17ప్రోను బీట్ చేసే కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో నాలుగు 50MP లెన్స్ డ్యుయల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్స్ తో ఉన్నాయి. ఇది కూడా 6x జూమింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ లో అన్ని ఫోన్ల కంటే ది బెస్ట్ కెమెరాతో సామ్ సంగ్ ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంటోంది. దీని ఇతర ఫీచర్స్ కూడా టెక్ లవర్స్ ను కట్టిపడేస్తున్నాయి.
ముఖ్యంగా Samsung Galaxy S25 Ultra ఐఫోన్ 17ప్రో కెమెరాను బీట్ చేస్తూ గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో 200MP primary sensor, 50MP periscope lensతో పాటు 10MP 3x telephoto, and 50MP ultrawide cameraలతో బెస్ట్ కెమెరా సెటప్ ఉంది. ఇది 8K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీని జూమింగ్ కెపాసిటీ ప్రోఫెషనల్ కెమెరాలను గుర్తు చేసేలా ఉంది. వీటితో పాటు వీవో సైతం ఐఫోన్ 17ప్రోకు పోటీ ఇచ్చే కెమెరా కలిగిన ఫోన్ ను తీసుకువచ్చింది. ఇందులో Vivo X200 Pro బెస్ట్ కెమెరా ఎక్స్ పీరియన్స్ ఇస్తూ టెక్ లవర్స్ ను ఆకర్షిస్తోంది. దీని కెమెరా సెటప్ లో 50MP primary lens, 200MP telephoto camera, 50MP ultrawide sensorలు ఉన్నాయి. ఇది కూడా 8K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంతో చాలా మంది ఆండ్రాయిడ్ కోరుకునేవారు దీనివైపు కూడా చూస్తున్నారు.






