- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోమేటిక్ దోసె మెషీన్ వచ్చేసింది.. బిర్యానీకి కూడా కావాలంటున్న ఫుడ్ లవర్స్!
అచ్చం మనుషులు వేసినట్లుగా ఎరుపు రంగులో, క్రిస్పీగా దోసెలను వేస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక ఇంజనీర్ తయారు చేసిన ఈ రోబోట్ దోసె మెషీన్‌ను.. ప్రస్తుతం ఫుడ్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది

దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఇండియన్ వంటకాలు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అందులోనూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో దోసెకు అయితే ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ఇక దోసెల్లో (Dosa) ప్లేన్ దోసె, ఆనియన్ దోసె, మసాలా దోసె ఇలా పలు రకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ దోసెల పురాణం ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల నెట్టింట ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోలో ఒక రోబోట్ మెషీన్ ఆటోమేటిక్‌గా దోసెలను తయారు చేస్తోంది. అచ్చం మనుషులు వేసినట్లుగా ఎరుపు రంగులో, క్రిస్పీగా దోసెలను వేస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక ఇంజనీర్ తయారు చేసిన ఈ రోబోట్ దోసె మెషీన్‌ను (Dosa machine).. ప్రస్తుతం ఫుడ్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. ఇప్పటికే మనుషులు అవసరం లేకుండా ఎన్నో పనులు మెషీన్లు చేసేస్తున్నాయి. చివరికి అనం వండేందుకు రైస్ కుక్కర్, చపాతీలు చేసేందుకు రోటీ మేకర్.. ఇలా అనేక మెషీన్ వంటగదిలోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే దోసె తయారీ కోసం కూడా ఓ మెషీన్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సదరు ఇంజనీర్ రెడ్డిట్ వేదికగా వివరాలను పంచుకున్నాడు. ఇక అతను తయారు చేసిన హోమ్-బిల్ట్ రోబోట్‌కు 'థిండీ' అని పేరు పెట్టాడు. రెడ్డిట్‌లో షేర్ చేసిన వీడియోలో, ఈ థిండీ మానవ సహాయం లేకుండా పిండిని తీసుకొని, వేడి తవా మీద సమానంగా పరచి, కొంచెం నూనె చల్లి, దోసెను ఖచ్చితమైన గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వేయించి, క్రిస్పీగా అందిస్తోంది. రోబోట్ వేసిన దోసెలు అనుభవజ్ఞుడైన వంటవాడు చేసినట్లుగా ఉండటం విశేషం. ఇక ఈ ఇంజనీర్ తన కుటుంబ సభ్యులు దోసెలు వేయడం చూసి, వారి సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో ఈ రోబోట్‌ను తయారు చేసినట్లుగా తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు 'బిర్యానీ తయారు చేసే రోబోట్ కావాలి' అని, మరికొందరు 'సూపర్ ఐడియా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.






