డిజిటల్ అరెస్ట్ అయ్యారని ఫోన్ వచ్చిందా? అయితే ఇలా చేయండి!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-20 07:52:23  IST  )

సైబ‌ర్ నేర‌గాళ్లు ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు త‌ర‌చూ కొత్త దారులు వెతుకుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లికాలంలో ఎక్కువ‌గా డిజిట‌ల్ అరెస్టుల‌కు పాల్ప‌డుతున్నారు.

డిజిటల్ అరెస్ట్ అయ్యారని ఫోన్ వచ్చిందా? అయితే ఇలా చేయండి!
X

దిశ‌, వెబ్ డెస్క్: సైబ‌ర్ నేర‌గాళ్లు ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు త‌ర‌చూ కొత్త దారులు వెతుకుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లికాలంలో ఎక్కువ‌గా డిజిట‌ల్ అరెస్టుల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ డిజిట‌ల్ అరెస్ట్ ల కార‌ణంగా కొంత‌మంది బ‌య‌ప‌డి నేర‌గాళ్ల‌కు డ‌బ్బులు పంపిస్తే మ‌రికొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఓ అజ్ఞాత వ్య‌క్తి కాల్ చేసి మీరు అవినీతికి పాల్ప‌డిన‌ట్టు ఆధారాలు ఉన్నాయ‌ని, ఇన్ కమ్ ట్యాక్స్ క‌ట్ట‌లేదని ఇలా అనేక ర‌కాలుగా డిజిట‌ల్ అరెస్ట్ ల‌కు పాల్ప‌డ‌తారు.

త‌ర‌వాత డ‌బ్బులు డిమాండ్ చేసి ఇప్పుడే సెటిల్మెంట్ చేసుకోవాల‌ని చెబుతాడు. అయితే అలాంటి కాల్స్ కు బ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని తెలుపుతూ తెలంగాణ పోలీసులు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఏ పోలీస్ అధికారులు, ఇన్ కం ట్యాక్స్ అధికారులు కూడా నేరుగా రైడ్స్ చేస్తారు త‌ప్ప ఫోన్స్ చేయ‌ర‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి ఎవ‌రైనా ఫోన్ చేసి బెదిరించ‌గానే బ‌య‌ప‌డిపోవ‌ద్దు. ఒక‌వేళ ఎవ‌రైనా మీరు డిజిట‌ల్ అరెస్ట్ అయ్యార‌ని కాల్ చేస్తే వెంట‌నే 1930 నంబ‌ర్ కు ఫోన్ చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. video

Next Story