మూడు కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన ప్రముఖ కంపెనీ

by Disha Web Desk 17 |
మూడు కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన ప్రముఖ కంపెనీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Tecno, మూడు కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి పేరు Tecno Camon 20, Camon 20 Pro 5G, Camon 20 Premier 5G. ఇండియాలో శనివారం ఇవి లాంచ్ అయ్యాయి. మూడు ఫోన్లలో కూడా 5,000mAh బ్యాటరీలను అందించారు. Tecno Camon 20 ధర రూ. 14,999. ఇది 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. Camon 20 Pro 5G మోడల్ 8GB RAM+ 128GB స్టోరేజ్‌ రూ.19,999. 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 21,999.



స్పెసిఫికేషన్‌ల పరంగా Camon 20, Camon 20 Pro 5G ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి 6.67-అంగుళాల పూర్తి-HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13-ఆధారిత HiOS 13.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతాయి. Camon 20 మోడల్ 12nm MediaTek Helio G85 SoC ద్వారా పనిచేస్తే, 20 Pro 5G మోడల్ మాత్రం 6nm MediaTek డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌‌తో పనిచేస్తుంది. రెండు ఫోన్లు 64MP, 2MP కెమెరాలను, సెల్ఫీల కోసం 32MP కెమెరాలను కలిగి ఉన్నాయి.



Camon 20 Premier 5G మోడల్ MediaTek Dimensity 8050 SoC ద్వారా పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి-HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ కెమెరాతో పాటు, 108-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 32 MP కెమెరా ఉంది. ఈ మోడల్ 8GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర గురించి వెల్లడించనప్పటికి అంచనాల ప్రకారం, ఈ మోడల్ ధర రూ. 35,000 వరకు ఉండే అవకాశం ఉంది.


Next Story

Most Viewed