చాట్ జీపీటీ సేవల్లో సాంకేతిక లోపం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-16 04:10:48  IST  )

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) బేస్డ్ చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది.

చాట్ జీపీటీ సేవల్లో సాంకేతిక లోపం
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) బేస్డ్ చాట్‌బోట్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో సాంకేతిక లోపం కారణంగా అంతాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా చాట్‌ హిస్టరీ లోడ్‌ కావడం లేదని, చాట్ ప్రారంభించగానే ‘అసాధారణ ఎర్రర్‌’ వంటి సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదులు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ లోపాలు మొబైల్ యాప్‌లు, డెస్క్‌టాప్ బ్రౌజర్‌ వెర్షన్లలోనూ ఎదురవుతుండటంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని యూజర్లకు ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.

డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం, దాదాపు 82 శాతం మంది వినియోగదారులు చాట్‌జీపీటీ సేవలకు అనుసంధానమవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సంస్థ స్పందించింది. సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తమ దృష్టికి వచ్చిందని, సమస్యను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. చాట్‌జీపీటీతోపాటు రికార్డ్ మోడ్‌, కోడెక్స్‌, సోరా వంటి ఇతర సేవలపై కూడా ప్రభావం చూపినట్లు పేర్కొంది. అయితే, చాట్‌జీపీటీ సేవలు డౌన్‌ అవడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

కాగా, 2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. చిన్న ప్రశ్నల నుంచి క్లిష్టమైన సమస్యల దాకా వేగంగా సమాధానాలు ఇవ్వడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, ఈ టూల్‌పై అతిగా ఆధారపడటం మానవ ఆలోచనా శక్తిని తగ్గించే ప్రమాదం ఉందని, చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ ఇప్పటికే హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా మరల గుర్తించాల్సిన అవసరం ఉంది.

Next Story