- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్‌ప్లస్ ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. ఈనెల 27న కొత్త ఫోన్లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే!
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: చైనాకు (China) చెందిన స్మార్ట్ ఫోన్ల (Smartphone) తయారీ సంస్థ వన్ ప్లస్ (Oneplus) సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న వన్‌ప్లస్ ఇటీవల లాంఛ్ చేసిన ఎస్ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అలాగే, TWS ఇయర్‌బడ్స్‌ను లాంఛ్ చేయనుంది. వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్, వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్ పేర్లతో మార్కెట్లోకి రాబోయే ఈ ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
* వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్ (OnePlus Ace 5 Ultra Edition)
ముఖ్యంగా గేమింగ్ ప్రియుల కోసం వన్‌ప్లస్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్ బిగ్ డిస్‌ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో మిడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, ఫెంగ్చి గేమింగ్ కోర్, లింగ్జీ టచ్ చిప్, గేమింగ్ వై-ఫై చిప్ G1 వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇవి యూజర్లకు స్మూత్ గేమింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ ఫోన్‌ను ఫాంటమ్ బ్లాక్, బ్రీజ్ బ్లూ, టైటానియం గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వన్‌ప్లస్ ఈ మోడల్‌ను పలు వేరియంట్లలో అందించనుంది. వీటిలో 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి.
* వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్ (OnePlus Ace 5 Racing Edition)
ఇక ఈ వేరియంట్‌లో ఫోన్ మిడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇది 6.77 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన 120Hz LTPS డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్‌ను రాక్ బ్లాక్, వైట్, విల్డర్నెస్ గ్రీన్ రంగుల్లో విడుదల చేయనున్నారు. స్టోరేజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB లలో అందుబాటులో ఉండనుంది. డిజైన్ పరంగా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రూపొందించబడింది. దీని వల్ల ఫోన్ తేలికగా ఉండే అవకాశం ఉంది.
* వన్‌ప్లస్ బడ్స్ 4 (OnePlus Buds 4)
వన్‌ప్లస్ బడ్స్ 4లో ఫ్లాగ్‌షిప్ లెవెల్ శబ్ద నాణ్యత, డిజైన్, నాయిస్ రిడక్షన్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇంకా ఫ్రాస్టెడ్ మెటల్ లుక్, డ్యూయల్ DAC (OnePlus Buds Pro 3లో ఉపయోగించినదే) ఉండనున్నాయి. స్పేస్ గ్రే, పైన్ షాడో గ్రీన్ రంగులలో లభిస్తుంది.






