- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AIని గుడ్డిగా నమ్మకండి.. సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్
ఏఐని గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సేకరించే సమాచారం గుడ్డిగా నమ్మవద్దన్నారు. కృత్రిమ మేధ మోడల్స్ లో పొరపాట్లు జరుతున్నాయని చెప్పారు. సమాచార స్పష్టత కోసం మాత్రమే ఏఐతో పాటు ఇతర విధానాలను కూడా సరిచూసుకోవాలని సూచించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏఐని గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సేకరించే సమాచారం గుడ్డిగా నమ్మవద్దన్నారు. కృత్రిమ మేధ మోడల్స్ లో పొరపాట్లు జరుతున్నాయని చెప్పారు. సమాచార స్పష్టత కోసం మాత్రమే ఏఐతో పాటు ఇతర విధానాలను కూడా సరిచూసుకోవాలని సూచించారు. ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ఉన్న ఇతర వ్యవస్థలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. ఏదైనా సృజనాత్మకంగా రాయాలని భావిస్తే అప్పుడే ఏఐ టూల్స్ ను సక్రమంగా వినించే రీతిలో ఉండాలన్నారు.
కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు చాలా వర్క్ చేస్తున్నామని దీనిపట్ల గర్వంగా ఉందని అన్నారు. గూగుల్ ఏఐ తాజా మెడల్ జెమిని 3.0 కోసం టెక్ ప్రపంచం ఎదురుచూస్తున్నదని తెలిపారు. అంతే కాకుండా ఏఐ అనే బుడగ పగిలిపోతే అన్ని కంపెనీలపై ప్రభావం పడుతుందని అన్నారు. దానికి గూగుల్ కూడా అతీతం కాదని స్పష్టం చేశారు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐతో పోటీ ఉన్న నేపథ్యంలో ఆల్ఫాబెట్‌కు పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్నారు. ఏఐకి చెందిన సూపర్ చిప్స్‌ను ఆల్ఫా సంస్థ డెవలప్ చేస్తుందని తెలిపారు.






