అదిరిపోయే మ్యూజిక్ సౌండ్.. Sony కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు

by Disha Web Desk 17 |
అదిరిపోయే మ్యూజిక్ సౌండ్.. Sony కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: సోనీ కంపెనీ నుంచి కొత్తగా వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. దీని పేరు ‘WH-CH520’. దీని ప్రత్యేకత ఏమిటంటే బ్యాటరీ లైఫ్ 50 గంటల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సోనీ ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్‌లు, ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 4,490. హెడ్‌ఫోన్‌లు SBC, AAC కోడెక్‌లకు సపోర్ట్‌తో 30mm క్లోజ్డ్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. అత్యుత్తమైన సౌండ్ అందించడానికి DSEE (డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్)కూడా ఉంది. దీనిని సినిమాటిక్ సౌండ్‌ను అనుభవించేలా ప్రత్యేకంగా తయారుచేశారు.


ఆండ్రాయిడ్, Windows, ఇతర డివైజ్‌లకు సులువుగా కనెక్డ్ అవుతుంది. బ్లూ, లేత గోధుమరంగు, తెలుపు, బ్లాక్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. తేలికగా, తక్కువ బరువుతో ఉంటుంది. చార్జింగ్ పరంగా కేవలం 3 నిమిషాల చార్జ్‌తో 1 గంట ప్లేబ్యాక్ టైం పొందవచ్చు. హెడ్‌ఫోన్‌లు డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్‌తో వచ్చాయి. దీని ద్వారా ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ కావచ్చు.




Next Story