అదిరిపోయే సౌండ్‌ అందించే Sony కొత్త ఇయర్‌బడ్స్

by Disha Web Desk 17 |
అదిరిపోయే సౌండ్‌ అందించే Sony కొత్త ఇయర్‌బడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సోనీ కంపెనీ నుంచి కొత్తగా వైర్‌లెస్ స్టీరియో(TWS) ఇయర్‌బడ్స్ భారత్‌లోకి విడుదలయ్యాయి. ఈ మోడల్ పేరు ‘Sony WF-C700N’. దీని ధర రూ.8,990. ఇది జులై 15 నుంచి సోనీ అధికారిక రిటైల్ స్టోర్‌లు, ShopatSC వెబ్‌సైట్, ఇతర ఈ కామర్స్ సంస్థల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇయర్‌బడ్స్ బ్లాక్, లావెండర్, సేజ్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో వచ్చాయి. ప్రత్యేకంగా 360 రియాలిటీ ఆడియో సర్టిఫికెట్‌ను పొందాయి.

ఇవి పరిసరాల నుంచి వచ్చే సౌండ్‌ నుంచి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూస్తుంది. డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ (DSEE) ద్వారా ఇయర్‌బడ్స్ మెరుగైన సౌండ్ నాణ్యతను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఫోకస్ ఆన్ చాట్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా ఇయర్‌ఫోన్‌లతో కూడా చాట్ చేయవచ్చు.

ఇవి గరిష్టంగా 15 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందజేస్తాయి. కేవలం 10 నిమిషాల చార్జ్‌తో ఒక గంట ప్లేబ్యాక్‌ను అందిస్తుందని సోనీ తెలిపింది. Android/iPhone లో Google అసిస్టెంట్ లేదా Siri ద్వారా వాయిస్ కంట్రోలింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. నీరు, దుమ్ము, చెమట నుంచి రక్షణ కోసం IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది.


Next Story