సోనీ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్‌

by Disha Web Desk 17 |
సోనీ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: సోనీ కంపెనీ కొత్తగా వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌లను సోమవారం విడుదల చేసింది. వీటి పేరు ‘సోనీ WF-1000XM5’. ధర రూ. 24,447. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో భారత్‌లో అమ్మకానికి వస్తాయి. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో వచ్చాయి. మెరుగైన సౌండ్, మంచి కాల్ క్వాలిటీని అందిస్తాయి. వైర్‌లెస్ హెడ్‌సెట్‌లో సోనీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V2 చిప్, QN2e ప్రాసెసర్‌లు ఉన్నాయి. ఇవి డైనమిక్ డ్రైవర్ Xతో అమర్చబడి ఉంటాయి.

ఇయర్‌బడ్స్‌ స్పీక్ టు చాట్, అడాప్టివ్ సౌండ్ కంట్రోల్, మల్టీపాయింట్ కనెక్ట్, ఫాస్ట్ పెయిర్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, గూగుల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తాయి. సాధారణ వినియోగంతో గరిష్టంగా 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయని సోనీ పేర్కొంది. చార్జింగ్ పోర్ట్ USB టైప్-సి కేబుల్ లేదా వైర్‌లెస్‌తో చార్జ్ చేయవచ్చు. దమ్ము, నీటి నిరోధకత కోసం IPX4 రేటింగ్ చేయబడింది.


Next Story