Skype: స్కైప్ సేవలకు స్వస్తి.. మే 5 తర్వాత శాశ్వతంగా నిలిపివేత

by Yella Dhawani Reddy |

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు (Microsoft) చెందిన వీడియో కాలింగ్ ప్లాట్ ఫామ్ స్కైప్ (Skype) సేవలకు శాశ్వతంగా నిలిచిపోతున్నాయి.

Skype: స్కైప్ సేవలకు స్వస్తి.. మే 5 తర్వాత శాశ్వతంగా నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు (Microsoft) చెందిన వీడియో కాలింగ్ ప్లాట్ ఫామ్ స్కైప్ (Skype) సేవలకు శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. ఈ నెల 5 నుంచి స్కైప్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన స్కైప్‌కు కరోనా త్వరత ఆదరణ తగ్గటం, మార్కెట్‌లో పోటీగా మెరుగైన ఇతర ప్రత్యామ్నాయాలు రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిని వాడుతున్న యూజర్లు టీమ్స్‌కు (Teams) మారాల్సి ఉంటుందని తెలిపింది.

2003లో తొలుత తన సేవలను ప్రారంభించిన స్కైప్.. వీడియో కాలింగ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 2011లో దీనిని మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. 2017లో మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ను లాంచ్‌ చేసింది. నాటి నుంచి స్కైప్‌ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటుంది. అలాగే, మెసేజింగ్, వీడియో కాల్స్ ఇతర సర్వీసుల కోసం టీమ్స్‌ను ప్రాథమిక కేంద్రంగా సంస్థ పూర్తిగా దృష్టి పెడుతోంది. స్కైప్ నుంచి టీమ్స్‌కు మైగ్రేట్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ యూజర్లకు చాలా నెలల సమయం ఇచ్చింది. టీమ్‌ల్లోకి లాగిన్ కావడానికి ఇప్పటికే ఉన్న స్కైప్ ఐడీలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది యూజర్‌ ట్రాన్‌పర్మేషన్‌ను సులభతరం చేసింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది.

కాగా, మార్కెట్‌లో టీమ్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. యూజర్లు వీడియో కాలింగ్ ఫీచర్లను అందించే గూగుల్ మీట్, జూమ్ లేదా వాట్సాప్‌.. వంటి సర్వీసులు ఉన్నాయి. అయితే స్కైప్‌తో పోలిస్తే టీమ్స్‌ మరింత ఆధునిక, ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్‌ నొక్కి చెప్పింది.

Next Story