- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT లోకి వచ్చేసిన "పెద్ది"
"పెద్ది" చిత్రం గురువారం తెల్లవారుజాము నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన పవర్‌ఫుల్ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా "పెద్ది" బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం.. గురువారం తెల్లవారుజాము నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్ రన్‌టైమ్ పరిమితుల కారణంగా కట్ చేసిన కొన్ని ముఖ్యమైన కొత్త సన్నివేశాలను (Deleted/Extended Scenes) నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో అదనంగా జోడించారు. దీనివల్ల కథలోని ఎమోషన్స్, క్యారెక్టర్ ఆర్క్స్ డిజిటల్ ఆడియన్స్‌కు మరింత వినోదాన్ని పంచనున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం మాతృభాష తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ కథానాయికగా నటించగా, కన్నడ లెజెండ్రీ నటుడు శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్‌ను మునుపెన్నడూ లేని రగ్గడ్ మాస్ లుక్‌లో బుచ్చిబాబు చూపించిన విధానం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.






