- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో మార్కెట్‌లోకి Samsung Galaxy S26 Ultra.. రిలీజ్ డేట్, ఫీచర్స్ ఇవే!
సామ్ సంగ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా త్వరలోనే లాంచ్ అవ్వబోతుంది. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 26 టెక్ ప్రియుల మనసును దోచేయడంతో అల్ట్రాపై సైతం ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సామ్ సంగ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా త్వరలోనే లాంచ్ అవ్వబోతుంది. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 26 టెక్ ప్రియుల మనసును దోచేయడంతో అల్ట్రాపై సైతం ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే పలు వార్తా కథనాల ప్రకారం 2026 జనవరిలో ఈ ఫోన్ ఇండియాలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా అమెరికాలో ఈ ఫోన్ ధర 1,299 డాలర్లు కాగా, యూకే మార్కెట్ లో 965 పౌండ్లు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇండియన్ మార్కెట్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా 16జీబీ ర్యామ్, 256జీబీ మెమోరీ ఫీచర్లతో ఉండే మోడల్ ధర రూ. 1,59,999 ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్ ఉండబోతుందని తెలుస్తోంది.
దీంతో పాటు 5500 mAh బ్యాటరీ, 60w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండబోతుంది. డివైజ్ లో 6.9 అంగులాల OLED డిస్ ప్లే 120హెచ్ జడ్ రీఫ్రెష్ రేట్ తో ఉండబోతుంది. కెమెరా విషయానికి వస్తే 200 మెగాపిక్సల్ సోనీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 12MP టెలిఫోటో షూటర్ మరియు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌లతో కూడిన కెమెరా సెటప్ ఉంటుంది. ఇది మంచి జూమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంతో పాటు బెస్ట్ క్వాలిటీ ఫోటోలను అందిస్తుంది. ఈ ఫోన్ కు కూడా దాని ముందు వర్షన్ కలర్ ఉండే అవకాశం ఉంది. అయితే డిజైన్ మాత్రం చాలా భిన్నంగా ఉండబోతుంది.






