ఈ శాంసంగ్ ఫోన్ పై రూ.15 వేల డిస్కౌంట్..పూర్తి వివ‌రాలు ఇవే

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 10:57:41  IST  )

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ( Samsung Galaxy S26 Ultra ) మొబైల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ.

ఈ శాంసంగ్ ఫోన్ పై రూ.15 వేల డిస్కౌంట్..పూర్తి వివ‌రాలు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత మార్కెట్ లో శాంసంగ్ ఫోన్లకు ఉన్న డిమాండ్ అంతా కాదు. ఎంత ఖర్చైనా పర్వాలేదని, సేఫ్టీ కోసం శాంసంగ్ ఫోన్స్ కొంటారు. దానికి తగ్గట్టుగానే శాంసంగ్ నుంచి రకరకాల మొబైల్స్ వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ( Samsung Galaxy S26 Ultra ) మొబైల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ మొబైల్ ఫోన్ పై రూ. 9000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.

Samsung Galaxy S26 Ultra పై భారీ డిస్కౌంట్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు HDFC, ICICI బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడితే రూ. 9000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఓవరాల్ గా రూ.15,000 వరకు డిస్కౌంట్ వస్తుందని తెలుస్తోంది. 12 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 6.8 అంగుళాల డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ లో 200 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది. AI ఫీచర్స్ కూడా అందిస్తోంది కంపెనీ. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా రూ.1.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Next Story