- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సగం ధరకే Samsung Galaxy S24.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో క్రేజీ ఆఫర్
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో దీపావళి సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఫేవరెట్ Samsung Galaxy S24పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో దీపావళి సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఫేవరెట్ Samsung Galaxy S24పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. Samsung Galaxy S24 లాచింగ్ ధర రూ.74,999 కాగా ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కేవలం 39,999కే లభిస్తోంది. అంతే కాకుండా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడినట్టయితే మరో రూ.1,950 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.38,540కి తగ్గుతుంది.
ఇక ఈ ఫోన్ పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ సైతం వర్తిస్తుంది. మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసినట్లయితే మరో రూ.8వేల వరకు తగ్గుతుంది. దీంతో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24ను కేవలం రూ.30వేలకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఫోన్ లాంచింగ్ ధరతో చూస్తే సగం ధరకే పొందవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే మరియు ఒనిక్స్ బ్లాక్ అనే నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంది.
ఇందులో 6.2 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్ ప్లే ఉంది. ఇది Qualcomm Snapdragon 8 gen 3 ప్రాసెసర్‌తో Adreno 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఇక ఇందులో 50MP + 12MP రేర్ కెమెరా ఉండగా 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అదే విధంగా 4000 mAh బ్యాటరీ ఉంది. ఒకవేళ మీరు రూ.30వేలలో ఫోన్ తీసుకోవాలని అనుకుంటే గెలాక్సీ ఎస్ 24 చాలా మంచి ఆప్షన్ అవుతుంది.






