మార్కెట్లోకి Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
మార్కెట్లోకి Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Samsung కంపెనీ నుంచి కొత్తగా మార్కెట్లోకి Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇది భారీ బ్యాటరీతో అడుగుపెట్టింది. స్మార్ట్ ఫోన్ 4GB RAM+128GB వేరియంట్ ధర రూ. 13,490, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,990. ఫోన్ బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఏప్రిల్ 21, మధ్యాహ్నం 12 గంటల నుండి Samsung వెబ్‌సైట్, Amazon సైట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.


Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్‌లు

* పూర్తి-HD+ (2408 x 1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లే.

* ఆండ్రాయిడ్ 13, Samsung One UI 5 స్కిన్‌తో రన్ అవుతుంది.

* Mali G68 GPUతో పాటు Exynos 1330 ఆక్టా-కోర్ SoC ద్వారా పనిచేస్తుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+ 2MP+ 2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు వైపు 13MP కెమెరా ఉంది.

* 25W చార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉంది.

* ఫింగర్ ప్రింట్ స్కానర్ సైడ్‌కు అమర్చారు.

Next Story