‘Galaxy F54 5G’ స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్‌‌ ప్రారంభం

by Disha Web Desk 17 |
‘Galaxy F54 5G’ స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్‌‌ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: Samsung కంపెనీ నుంచి కొత్త మోడల్ ‘Galaxy F54 5G’ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. కంపెనీ ఇటీవల ధృవీకరించిన దాని ప్రకారం, ఈ ఫోన్ జూన్ 6న దేశంలో లాంచ్ అవుతుంది. మే 30 న ఫోన్ ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది. దీని కోసం రూ. 999 చెల్లించాలి.



Samsung Galaxy F54 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED ప్లస్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 120Hz గా ఉంది. ఫొన్ Exynos 1380 ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రన్ అవుతుంది. కెమెరా పరంగా బ్యాక్‌సైడ్ 108MP + 8MP + 2MP కెమెరాలు ఉన్నాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లో 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని అమర్చారు. అంచనాల ప్రకారం ఫోన్ ధర రూ. 29,999.





Next Story