Galaxy సిరీస్‌లో మరో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన Samsung

by Disha Web Desk 17 |
Galaxy సిరీస్‌లో మరో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన Samsung
X

దిశ, వెబ్‌డెస్క్: శామ్‌సంగ్ కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‘Galaxy F14 5G’ శుక్రవారం ఇండియాలో లాంచ్ అయింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 12,990. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 14,990. మార్చి 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌, కంపెనీ అధికారిక సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.


Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్‌లు

* 6.6-అంగుళాల పూర్తి HD+ IPS LCD డిస్‌ప్లే,90Hz రిఫ్రెష్ రేట్‌.

* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ కూడా ఉంది.

* ఆండ్రాయిడ్ 13 One UI 5 ద్వారా రన్ అవుతుంది.

* 5nm Exynos 1330 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+ 2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉంది.

* ఫోన్ 25W ఫాస్ట్ చార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.






Next Story

Most Viewed