Galaxy సిరీస్‌లో Samsung కొత్త ల్యాప్‌టాప్‌లు.. మొదలైన ప్రీ-బుకింగ్స్

by Disha Web Desk 17 |
Galaxy సిరీస్‌లో Samsung కొత్త ల్యాప్‌టాప్‌లు.. మొదలైన ప్రీ-బుకింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్, ల్యాప్‌టాప్ విభాగంలో Galaxy Book 3 సిరీస్‌లో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. కొత్త వేరియంట్లు Galaxy Book 3 Ultra, Galaxy Book 3 Pro. ఈ వేరియంట్లకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌ను కంపెనీ ప్రారంభించింది. ఫిబ్రవరి 1న Galaxy Unpacked 2023 ఈవెంట్‌లో వీటిని ఆవిష్కరించనున్నారు. ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రూ. 5,000 విలువైన బెనిఫిట్స్, Samsung Shop యాప్‌లో రూ. 2,000 విలువైన షాపింగ్ వోచర్‌లను కంపెనీ అందిస్తోంది.


నివేదికల ప్రకారం, Samsung Galaxy Book 3 Ultra 13వ జెన్ ఇంటెల్ కోర్ i9-13900H ప్రాసెసర్, 32GB RAM, 1TB మెమరీతో వస్తుంది. ఇది 2880x1800p రిజల్యూషన్‌తో 16-అంగుళాల 3K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

Galaxy Book 3 Pro, 14 అంగుళాలు, 16 అంగుళాల స్క్రీన్‌ల వేరియంట్లలో లభిస్తుంది. రెండూ 3K AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. కోర్ i5, కోర్ i7, 13వ తరం ఇంటెల్ ప్రాసెసర్‌లు, 16 GB RAM, 1TB వరకు మెమరీ, Intel Iris Xe ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో వస్తున్నాయి. రెండూ Windows 11 హోమ్‌ ద్వారా రన్ అవుతాయి. అలాగే 65W పవర్ అడాప్టర్‌ను కలిగి ఉంటాయి.

https://www.samsung.com/in/galaxy-book/pre-reserve-upcoming-laptop/

Next Story

Most Viewed