రిపబ్లిక్ డే సేల్.. వన్ ప్లస్ మొబైల్స్‌పై బంపర్ ఆఫర్

by Disha Web Desk 8 |
రిపబ్లిక్ డే సేల్.. వన్ ప్లస్ మొబైల్స్‌పై బంపర్ ఆఫర్
X

దిశ, ఫీచర్స్ : వన్‌ప్లస్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్లాట్‌ఫామ్స్‌లో రిపబ్లిక్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు వివరించారు. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 6వేల తగ్గింపుతో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఫోన్‌‌ను అందిస్తున్నారు. కాగా ఫోన్ పై అమెజాన్‌ అందిస్తున్న తగ్గింపు ఆఫర్‌తో పాటు ఆ ఫోన్‌ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

వన్ ప్లస్ నార్డ్ 3 128 GB వేరియంట్ తో ప్రారంభ ధర రూ.33,999 కాగా ప్రస్తుతం అమెజాన్ లో రూ.29,999 కే లభిస్తోంది. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ లో భాగంగా రూ.4000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. అలాగే వన్ ప్లస్ కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై 1000 రూపాయల కూపన్ కూడా అందిస్తోంది. అలాగే ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ 1000 రూపాయలు పొందుతారు. ఇక మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు రూ.27,999 కే పొందవచ్చు. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు టు ఎంపీ మైక్రో సెన్సార్ అమర్చబడింది.

వీడియో కాల్స్ కోసం 16ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు.80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 6.74 అంగుళాల AMOLED డిస్ప్లే తోపాటు 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. అలాగే టెంపెస్ట్ గ్రే , మిస్టీ గ్రీన్ కలర్ లో లభ్యమవుతుంది.



Next Story

Most Viewed