రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ

by Disha Web Desk 8 |
రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఫెస్టివల్ వస్తే చాలు చాలా మంది ఆఫర్స్ కోసం చూస్తుంటారు.ముఖ్యంగా ఫ్లిప్ కార్టులో ఫెస్టివల్ ఆఫర్స్ ఏం ఉన్నాయి. ఎంత ఏ వస్తువులకు ఎంత డిస్కౌంట్ ఉంది అని వెతుకుతారు. అలాగే ఫ్లిప్ కార్ట్ కూడా కస్టమర్ల కోసం బెస్ట్ ఆఫర్స్‌ను అందిస్తూనే ఉంటుంది.

అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ సూపర్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ముఖ్యంగా ఇందులో బ్యాంకు కార్డులతో పాటు డిస్కౌంట్ పైన కూడా స్మార్ట్ టీవీలను కేవలం రూ .20 వేల రూపాయలకే వచ్చే విధంగా ఆఫర్లను ప్రకటించింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఎవరైనా బడ్జెట్ ధరలకే స్మార్ట్ టీవీ ని కొనాలని చూసేవారికి ఇదొక సరైన డీల్ అని చెప్పవచ్చు.

Infinix 43 inches ఫ్లిప్ కార్ట్ లో ఇన్ఫినిక్స్ -43 అంగుళాల QLED 4K UHD స్మార్ట్ టీవీ సైతం ఈ రోజున 30% డిస్కౌంట్తో కేవలం రూ.20,999 రూపాయలకే అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ టీవీల పైన ICICI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా మరో 10 శాతం డిస్కౌంట్ కూడా కలదు.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ డిస్ప్లే విషయానికి వస్తే..3840X2160 తో కలదు.అలాగే టీవీ స్క్రీన్ QLED టెక్నాలజీతో పనిచేస్తుంది. HDR -10 సపోర్టుతో అదిరిపోయే విజువల్స్ ను కలిగి ఉండడంతో పాటు డాల్బీ ఆడియో సపోర్టు సౌండ్ కూడా అందించగలదు.ఈటీవీకి 4.1 రేటింగ్ ఉంది.

Next Story

Most Viewed