అదిరిపోయే ఫీచర్స్‌తో Redmi స్మార్ట్‌వాచ్

by Disha Web Desk 17 |
అదిరిపోయే ఫీచర్స్‌తో Redmi స్మార్ట్‌వాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Redmi కొత్తగా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Redmi వాచ్ 3 యాక్టివ్’. దీని ధర రూ.2,999. స్మార్ట్‌వాచ్ ఆగస్టు 3న మధ్యాహ్నం 12గంటల నుండి Xiaomi రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి వాచ్ 3 యాక్టివ్ 240×280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.83-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని అందించారు. దీంతో వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేయవచ్చు, ఆన్సర్ చేయవచ్చు. దీనిలో 10 కాంటాక్ట్ నెంబర్లను కూడా సేవ్ చేసుకోవచ్చు.

ఈ వాచ్‌లో స్లీప్ మానిటరింగ్, హార్ట్ బీట్ ట్రాకర్, Spo2 ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, 200 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఇది Android 6.0 లేదా iOS 12 అంతకంటే ఎక్కువ వెర్షన్‌ డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. దీనిలో 289mAh బ్యాటరీని అందించారు. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వాచ్ మాగ్నెటిక్ చార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది . నీటి నుంచి రక్షణ కోసం 5ATM రేటింగ్ కలిగి ఉంది.

Read More : తక్కువ ధరలో 4G, 5G స్మార్ట్‌ఫోన్‌లను ఒకేసారి విడుదల చేసిన Redmi

Next Story

Most Viewed