- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడ్రోజుల్లో Redmi కొత్తఫోన్ లాంచ్.. ఫీచర్స్ బుర్రపాడు అంతే..
వరుస టీజర్లతో కొత్త స్మార్ట్ ఫోన్ పై భారీ అంచనాలు క్రియేట్ చేసిన షావోమీ.. తాజాగా ఆ ఫోన్ లాంచ్ డేట్ ను వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: వరుస టీజర్లతో కొత్త స్మార్ట్ ఫోన్ పై భారీ అంచనాలు క్రియేట్ చేసిన షావోమీ.. తాజాగా ఆ ఫోన్ లాంచ్ డేట్ ను వెల్లడించింది. రెడ్ మీ టర్బో 5(Redmi Turbo 5) సిరీస్ ను జనవరి 29న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇందులో రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ (REDMI Turbo 5 Max) లాంచ్ కానుంది. మీడియాటెక్ డిమెంసిటీ 9500s ప్రాసెసర్ తో లాంచ్ అవుతున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది.
రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ సిరీస్ లో షియోమీ భారీ బ్యాటరీని ఇంట్రడ్యూస్ చేస్తోంది. షియోమీ నుంచి ఇప్పటి వరకూ లాంచ్ అయిన మొబైల్స్ లో ఏ మొబైల్ కూ ఈ రేంజ్ బ్యాటరీ ఇవ్వలేదు. తొలిసారి 9000mAh బ్యాటరీని పరిచయం చేస్తుంది. దీనికి 100W ఫాస్ట్ ఛార్జర్ తో పాటు.. 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డివైజ్ చాలా ఆకర్షణీయంగా రూపొందించింది. ఎలిగెంట్ లార్జ్ రౌండెడ్ కార్నర్స్, అల్ట్రా - న్యారో బెజెల్స్, CNC మెటల్ ఫ్రేమ్, ఫ్లాగ్ షిప్ ఫైబర్ గ్లాస్ రియర్ ఫినిష్, మెటల్ రేస్ ట్రాక్ షేప్ డెకో, డబుల్ రింగ్ టర్బైన్ లైట్ స్ట్రిప్ కూడా ఉండనున్నాయి. sea breeze blue కలర్లో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ కు MediaTek Dimensity 9500s SoCను TSMC N3E ప్రాసెస్ తో రూపొందించారు. Mali Immortails-G925 MC12 GPU హైఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కు సపోర్ట్ గా ఉండనుంది.
రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ తో పాటు రెడ్ మీ బడ్స్ 8 ప్రో ను కూడా లాంచ్ చేయనుంది. డ్యూయల్ 6.7mm పీజో ఎలక్ట్రిక్ సెరామిక్ డ్రైవర్స్, 11mm టైటానియం - ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్, Xiomi own MIHC కోడెక్, LHDC-V5 సపోర్ట్ తో పాటు.. 55 డీబీ, 5kHz అల్ట్రా వైడ్ బ్యాండ్ నాయిన్ క్యాన్సిలేషన్ తో 28dB నాయిస్ తగ్గింపును ఇస్తోంది. ఇందులో అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. హ్యారీపోట్టర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా రెడ్ మీ ప్యాడ్ 2 ప్రో హ్యారీ పోట్టర్ ఎడిషన్ Redmi Pad 2 Pro Harry Potter Editionను కూడా షావోమీ లాంచ్ చేయనుంది. ఇందులో హాగ్వార్ట్స్ స్కూల్ బ్యాడ్జ్ ఎంగ్రేవింగ్, డీప్ కస్టమైజేషన్ థీమ్, మ్యాజికల్ స్కూల్ స్టైల్ స్టోరేజ్ బ్యాగ్ కూడా ఉండనున్నాయి. ఈ ఫోన్ రేటెంతో చెప్పలేదు కదా. చైనా కరెన్సీలో 4000 యువాన్స్ వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.52,500 వరకూ ధర ఉండొచ్చని సమాచారం.






