రెడ్మీ నుంచి క్రేజీ ఫోన్‌..9000 mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే?

by velandi.Saikiran |

Redmi Turbo 5 Max మొబైల్ ఫోన్ ఫ్యూచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్, 1.5k రిజలూషన్ కలిగి ఉంటుంది.

రెడ్మీ నుంచి క్రేజీ ఫోన్‌..9000 mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా ఉంటే.. మరికొన్ని ఖరీదైనవి వస్తున్నాయి. కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడేస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల లాగా కొత్త మొబైల్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే రెడ్మి నుంచి మరో ఫోన్ రాబోతోంది. రెడ్మీ టర్బో 5 మ్యాక్స్ ( Redmi Turbo 5 Max) పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

Redmi Turbo 5 Max ఫోన్ ఫీచర్లు ఇవే

Redmi Turbo 5 Max మొబైల్ ఫోన్ ఫ్యూచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్, 1.5k రిజలూషన్ కలిగి ఉంటుంది. 144 HZ రిఫ్రిష్ రేట్ కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ కెమెరా 50 ఎంపీ సామర్థ్యం ఉంటుంది. సెల్ఫీల కోసం కూడా మంచి కెమెరా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ స్పెషాలిటీ బ్యాటరీ. 9000mah బ్యాటరీతో ఈ మొబైల్ తీసుకువస్తున్నారు. 100 w ఉన్న చార్జర్ ఈ మొబైల్ ఫోన్ కు సపోర్ట్ చేయనుంది. చైనాలో జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Next Story