- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Redmi : 9000mAh బ్యాటరీతో క్రేజీ ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే
రెడ్మీ టర్బో 5 మ్యాక్స్ (Redmi Turbo 5) పేరుతో లాంఛ్ అయిన ఈ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.83 అంగుళాల ఈ ఫోన్ 1.5K OLED 120Hz డిస్ ప్లే కలిగి ఉండనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లోకి అనేక రకాల మొబైల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు. ఇలాంటి తరుణంలోనే రెడ్మీ కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. రెడ్మీ టర్బో 5 మ్యాక్స్ (Redmi Turbo 5) పేరుతో లాంఛ్ చేశారు. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. అయితే, ఈ ఫోన్ చైనాలో లాంఛ్ అయింది.
Redmi Turbo 5 Max ఫీచర్స్ ఇవే
రెడ్మీ టర్బో 5 మ్యాక్స్ (Redmi Turbo 5) పేరుతో లాంఛ్ అయిన ఈ ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.83 అంగుళాల ఈ ఫోన్ 1.5K OLED 120Hz డిస్ ప్లే కలిగి ఉండనుంది. ఇక ఈ ఫోన్ కు 50MP (Main with OIS) + 8MP (UW) ఫ్రైమరీ కెమెరా రానుంది. 20 MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. ఈ ఫోన్ కు 9000mAh బ్యాటరీ కూడా అందిస్తున్నారు. 100W వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. Android 16 ఆధారంగా ఈ ఫోన్ వర్క్ చేయనుంది. 12GB +256GB మోడల్ ఫోన్ ధర రూ.29,087గా ఉండనుంది. అయితే, ఈ ఫోన్ ఇండియాలో లాంఛ్ కాలేదు. కానీ POCO X8 Pro Max పేరుతో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.






