- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్మార్ట్ ఫోన్ లవర్స్‌కి క్రేజీ న్యూస్.. రియల్ మీ నుంచి కొత్త మొబైల్.. లాంఛ్, ఫీచర్లు, ధర వివరాలివే!

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) దర్శనమిస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో ఆయా ఫోన్ల తయారీ సంస్థలు మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ను లాంఛ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ చైనా దిగ్గజ సంస్థ రియల్ మీ (Realme) కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. Realme P3 సిరీస్‌ను భారత మార్కెట్‌లోకి ఈనెల 18న లాంఛ్ చేయనుంది. ఇక ఈ ఫోన్లు Realme P3 Pro, P3 5G, P3x 5G, P3 Ultra వేరియంట్లలో రానున్నాయి. ఈ సందర్భంగా ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రియల్ మీ P3 సిరీస్ ఫోన్లు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇప్పటికే కంపెనీ నుంచి వచ్చిన రియల్‌మి 14 ప్రో ప్లస్, రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఇక 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB స్టోరేజ్‌తో మూడు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000mAh బ్యాటరీ ఈ డివైజ్‌లో ఉంటుంది. అంటే.. కేవలం 24 నిమిషాల్లోనే ఈ ఫోన్‌ను 0-100% వరకు ఛార్జ్ చేయవచ్చు. డివైజ్ బ్యాటరీకి 4 సంవత్సరాల వ్యారెంటీ కూడా ఉంటుంది. మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సంస్థ ఇంకా వెల్లడించడలేదు. రియల్ మీ P3 ప్రో ధర రూ.25,000 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మూడు రంగులలో అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో కెమెరా స్పెసిఫికేషన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేసే 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో AI అల్ట్రా-స్టెడీ ఫ్రేమ్స్, హైపర్ రెస్పాన్స్ ఇంజిన్, AI అల్ట్రా టచ్ కంట్రోల్, AI మోషన్ కంట్రోల్ వంటి గేమింగ్ ఫోకస్డ్ సాఫ్ట్‌వేర్ ఇంప్రూవ్‌మెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.