- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realme Narzo N53లో కొత్త స్టోరేజ్ వేరియంట్ విడుదల
Realme కంపెనీ నుంచి గతంలో విడుదలైన Narzo N53 మోడల్‌లో కొత్త స్టోరేజ్ వేరియంట్ ఇటీవల మార్కెట్లోకి విడుదలైంది

దిశ, వెబ్‌డెస్క్: Realme కంపెనీ నుంచి గతంలో విడుదలైన Narzo N53 మోడల్‌లో కొత్త స్టోరేజ్ వేరియంట్ ఇటీవల మార్కెట్లోకి విడుదలైంది. ఇంతకుముందు 4GB, 6GB RAM తో ఫోన్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు 8GB RAM 128GB స్టోరేజ్‌తో లాంచ్ అయింది. దీని ధర రూ.11,999. ఇది ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. Narzo N53 మోడల్ 6.74-అంగుళాల డిస్‌ప్లేతో 90Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ Unisoc T612 SoC ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత Realme UI 4.0 తో పనిచేస్తుంది. బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ AI కెమెరా ముందు సెల్ఫీల కోసం 8 MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 33W వైర్డు SuperVOOC చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అందించారు.
- Tags
- Realme






