విడుదలకు సిద్ధంగా ఉన్న Realme Narzo 60

by Harish |   (  Updated:2023-06-23 11:01:48  IST  )

Realme నుంచి కొత్త మోడల్ Narzo 60 సిరీస్ త్వరలో ఇండియాలోకి రానుంది. అమెజాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

విడుదలకు సిద్ధంగా ఉన్న Realme Narzo 60
X

దిశ, వెబ్‌డెస్క్: Realme నుంచి కొత్త మోడల్ Narzo 60 సిరీస్ త్వరలో ఇండియాలోకి రానుంది. అమెజాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. లాంచ్ తేదీని పేర్కొననప్పటికి ఈ ఫోన్ రాక గురించిన పోస్టర్‌ అమెజాన్‌లో కనిపిస్తుంది. ఈ సిరీస్‌లో ప్రధానంగా Realme Narzo 60, Narzo 60 pro మోడళ్లు ఉన్నాయి. ఈ ఫోన్ గురించిన ఫీచర్లు గీక్‌బెంచ్‌లో లిస్ట్ అయ్యాయి. లిస్ట్‌లో పేర్కొన్న దాని ప్రకారం, ఈ సిరీస్ 6.43-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే‌తో రానుంది. MediaTek డైమెన్సిటీ 6020 SoC ద్వారా పనిచేస్తుంది. Realme UI 4.0 స్కిన్‌తో Android 13లో రన్ అవుతుంది. బేసిక్‌ 8GB RAM తో వస్తుంది.



ప్రధాన కెమెరా 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం. ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు. జూన్ 26న నార్జో 60 సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడిస్తుంది.

Next Story