- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realme GT 8 Pro : రియల్‌మీ నుంచి కొత్త ఫోన్..7000mAh బ్యాటరీ..ధర ఎంతంటే
అక్టోబర్ మాసంలో చైనాలో విడుదలైన రియల్ మీ జిటి 8 ప్రోను ( Realme GT 8 Pro) మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలో రియల్ మీ మొబైల్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ మొబైల్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అయితే మరో సరికొత్త మొబైల్ తీసుకువచ్చేందుకు రియల్ మీ ( Realme) కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే అక్టోబర్ మాసంలో చైనాలో విడుదలైన రియల్ మీ జిటి 8 ప్రోను ( Realme GT 8 Pro) మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు.
నవంబర్ 20వ తేదీన ఈ మొబైల్ ఫోన్ తీసుకు వస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది కంపెనీ. 6.79 ఇంచుల డిస్ప్లే కలిగి ఉన్న ఈ Realme GT 8 Pro మొబైల్ 50 MP ప్రధాన కెమెరాతో రానుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. 7000 mah బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ కు 120W వైర్డ్ ఛార్జర్ సపోర్టు చేయనుంది. Realme GT 8 Pro ఫోన్ బ్లూ, వైట్, గ్రీన్ కలర్స్ లో లభించనుంది. ఇక ఈ నెలలో లాంచ్ కాబోతన్న ఈ Realme GT 8 Pro ఫోన్ ధర రూ.65000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.






