- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realme 16 Pro series: 7000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో అదిరిపోయే ఫోన్లు..ధర ఎంతంటే ?
కొత్త సంవత్సరంలో రియల్ మీ 16 ప్రో సిరీస్ ( realme 16 Pro Series ) మొబైల్స్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో రియల్ మీ మొబైల్ ఫోన్లకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా రకరకాల ఫోన్స్ తీసుకువస్తుంది కంపెనీ. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో రియల్ మీ 16 ప్రో సిరీస్ ( realme 16 Pro Series ) మొబైల్స్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.
ఇక ఈ ఫోన్ల ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే...6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్స్ 7300 డైమెన్‌సిటీ కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. 200MP మెయిన్ కెమెరాతో పాటు సెల్పీల కోసం 50 MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. 7000mAh బ్యాటరీ కూడా అందిస్తున్నారు.
80W వైర్డ్ ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇందులో 8GB + 128GB కలిగి ఉన్న realme 16 Pro ధర రూ. 31,999గా ఫిక్స్ చేశారు. 8GB + 256GB ఫోన్ ధర రూ.33,999 కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.36,999గా ఫైనల్ చేసింది కంపెనీ. realme 16 Pro+ విషయానికి వస్తే 8GB + 128GB వేరియంట్ ధర రూ.39,999 ఉండనుంది. 8GB + 256GB ధర రూ. 41,999 కాగా, 12GB + 256GB వేరియంట్ రూ. 44,999గా ఫిక్స్ చేశారు.






