7000 mAh బ్యాట‌రీతో రియ‌ల్ మీ నుంచి క్రేజీ ఫోన్‌..ధ‌ర ఎంతంటే

by velandi.Saikiran |

Realme 16 5G మొబైల్ 7000 mah బ్యాటరీతోరాబోతోంది. ఏప్రిల్ రెండవ తేదీన దీన్ని లాంచ్ చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది.

Realme 16 5G India launch set for April 2 7000mAh battery
X

Realme 16 5G India launch set for April 2 7000mAh battery

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫోన్స్ వాడుతున్నాడు. దీంతో ఇండియాలో మొబైల్స్ మార్కెట్ కు ఎలాంటి ఢోకా కాలేదు. దీనికి తగ్గట్టుగానే అన్ని కంపెనీలు రకరకాల మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి కంపెనీలు. అయితే లేటెస్ట్ గా రియల్ మీ 16 5G ఫోన్ ( Realme 16 5G ) ఇండియన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ రెండవ తేదీన దీన్ని లాంచ్ చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది.

Realme 16 5G ఫీచర్స్

Realme 16 5G మొబైల్ 7000 mah బ్యాటరీతో మార్కెట్లోకి రాబోతోంది. అంటే ఈ ఫోన్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే రెండు రోజుల పాటు వాడుకోవచ్చు అన్నమాట. 100w ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ఈ ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పాటు రియల్ మీ UI 7.0 ఇంటర్ ఫేస్ కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ 6.7 అంగుళాల డిస్ ప్లే కూడా కలిగి ఉంటుంది. 200 MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ Realme 16 5G ఫోన్ కు అందిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ ధర 25వేల నుంచి 35 వేల మధ్య ఉంటుంది.

Next Story