- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ పై ఛార్జీలు వసూలు చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తే ఇకపై ఛార్జీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ పై ఛార్జీలు వసూలు చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తే ఇకపై ఛార్జీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఆర్బీఐ స్పందించింది.
ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ.. యూపీఐ ఎల్లప్పుడూ ఉచితంగానే ఉంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. కానీ ప్రస్తుతం యూపీఐ సేవలు ఉచితంగానే ఇవ్వాలని ప్రభుత్వం ఆర్బీఐ ధృడసంకల్పంతో ఉందని స్పష్టం చేశారు. అంతే కాకుండా క్రెడిట్ పై ఈఎంఐ ద్వారా ఫోన్ లను కొనుగోలు చేస్తే డిజిటల్ లాకింగ్ చేయడంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. డిజిటల్ లాకింగ్ చేస్తే వచ్చే నష్టాలు, లాభాల గురించి పరిశీలిస్తున్నామని అన్నారు.






