9000mah బ్యాట‌రీతో Poco ఫోన్‌..ఫీచ‌ర్స్, ధ‌ర వివ‌రాలు ఇవే

by velandi.Saikiran |

పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ మార్చి 17 న ఇండియాలో లాంచ్ కానుంది. 9,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది.

9000mah బ్యాట‌రీతో Poco ఫోన్‌..ఫీచ‌ర్స్, ధ‌ర వివ‌రాలు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మన భారతదేశంలో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు రెండు ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో, భారత దేశ వ్యాప్తంగా మొబైల్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను కూడా తీసుకువస్తున్నారు. జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియాలో పోకో బ్రాండ్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా Poco X8 Pro series మార్కెట్లోకి రాబోతుంది. మార్చి 17వ తేదీన మరో ఐదు రోజుల్లోనే పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ లాంచ్ కానుంది. ఇందులో POCO X8 Pro Max మోడల్ అందరినీ ఆకట్టుకునే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.

మరి ఈ POCO X8 Pro Max మోడల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. 6.83 అంగుళాల డిస్ ప్లే క‌లిగి ఉన్న ఈ ఫోన్‌, 9000mAh బ్యాట‌రీ సామ‌ర్థ్యం క‌లిగి ఉండ‌నుంది. 100W వైర్డ్, 27W రివ‌ర్స్ వైర్డ్ ఛార్జ‌ర్ స‌పోర్ట్ చేయ‌నుంది. 50MP లైట్ హంట‌ర్‌ 600 Main + 8MP Ultra Wide మెయిన్ కెమెరా రానుంది. 20MP సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. HyperOS 3 ఆధారంగా ప‌ని చేసే Android 16 వెర్ష‌న్ ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ బ‌రువు 219g ఉండ‌నుండ‌గా, 8.1mm మందం ఉంటుంది. ఇక Poco X8 Pro ఫోన్ ధ‌ర రూ.35 వేల ఉండ‌నుంద‌ని స‌మాచారం. POCO X8 Pro Max ధ‌ర రూ.45 వేలు ఉండే ఛాన్స్ ఉంది.

Next Story