- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోకో నుంచి మరో క్రేజీ ఫోన్...6500mAh బ్యాటరీ, ఫీచర్స్ ఇవే
Poco F8 Ultra మొబైల్ ఫోన్, 6,500 mah బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 100W చార్జర్, 50W వైర్లెస్ చార్జర్ కూడా

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లోకి రకరకాల మొబైల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతున్న నేపథ్యంలో మార్కెట్లో ఫోన్ విక్రయాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే రకరకాల కంపెనీల నుంచి ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పోకో నుంచి కీలక ప్రకటన వచ్చింది. పోకో ఎఫ్ 8 ఆల్ట్రా ( Poco F8 Ultra) పేరుతో మొబైల్ ఫోన్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. నవంబర్ 26వ తేదీన ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
6.9 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ Poco F8 Ultra మొబైల్ ఫోన్, 6,500 mah బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 100W చార్జర్, 50W వైర్లెస్ చార్జర్ కూడా ఈ మొబైల్ కు సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్ ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ మొబైల్ 50MP ప్రైమరీ ట్రిపుల్ కెమెరాతో లాంచ్ కాబోతుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. ఇక ఈ మొబైల్ బేస్ మోడల్ ధర 56, 990 రూపాయలుగా ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ మన ఇండియాలో 2026 జనవరిలో విడుదలయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






